మంత్రి కొండా సురేఖపై ఈసీ ఆగ్రహం

మంత్రి కొండా సురేఖపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి , బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఫై మంత్రి చేసిన వ్యాఖ్యలపై హెచ్చరిక జారీ చేసింది ఈసీ. ఎన్నికల ప్రచారంలో కేటీఆర్‌పై మంత్రి తీవ్ర ఆరోపణలు చేయడం ఫై బిఆర్ఎస్ శ్రేణులు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు మంత్రికి ఈసీ వార్నింగ్‌ ఇచ్చింది. ఎన్నికల సమయంలో జాగ్రత్తగా ఉండాలని.. ఆరోపణలు చేసే సమయంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది. స్టార్‌ క్యాంపెయినర్‌, మంత్రిగా మరింత బాధ్యతగా ఉండాలని హితవు పలికింది.

అసలు సురేఖ ఏమన్నదంటే..కేటీఆర్ ​ఫోన్‍ ట్యాపింగ్‍లతో ఎంతోమంది హీరోయిన్లను బ్లాక్‍ మెయిల్‍ చేశాడని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఎంతో మంది అధికారులను బలిచేసి వారు ఉద్యోగాలు కోల్పోయి జైలుకు వెళ్లేలా చేశారని అన్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని అందువల్లే కేసీఆర్‌ ఫాంహౌస్‌ నుంచి బయటకు వచ్చాడే తప్పా, రాష్ట్రం సర్వనాశనం అయిపోతున్న ఏనాడు బయటకు రాలేదని ఆమె విమర్శించారు. అధికారం లేకనే కేసీఆర్‌, కేటీఆర్‌ కొత్త డ్రామాలకు తెర తీశారని పేర్కొన్నారు.