ధనుష్ ‘సార్’ రిలీజ్ డేట్ వచ్చేసింది

ధనుష్ హీరోగా నటిస్తున్న సార్ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగు లో ‘సార్‌’ / ‘వాతి’ (తమిళం) గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై యువ నిర్మాత నాగవంశి నిర్మిస్తున్న ‘సార్’ సినిమా షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకుంది.

తొలిప్రేమ, మిస్టర్ మజ్ను చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండటం తో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో ధనుష్ ఒక ఉపాధ్యాయుడిగా కనిపించబోతున్నాడు. తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీని ఫిక్స్ చేశారు. డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రకటన చేస్తూ, అధికారిక పోస్టర్ ను వదిలారు. క్లాస్ రూమ్ కి సంధించిన ఈ పోస్టర్ ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోను డిసెంబర్ 02 నే విడుదల చేయనున్నారు.