పిఠాపురంలో భారీగా మద్యం పట్టివేత

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారీగా మద్యం..డబ్బు పట్టుబడుతోంది. ముఖ్యంగా పిఠాపురం లో పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు పెద్ద ఎత్తున మద్యం, డబ్బు ను పంపిణి చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈసీ అక్కడ గట్టి నిఘా ఏర్పాటు చేసారు.

ఈ తరుణంలోఎస్‌ఈబీ అధికారులు, పోలీసులు ఉమ్మడిగా ఆపరేషన్‌ చేపట్టగా పిఠాపురంలోని నాలుగు కాలనీల్లో భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న మద్యం విలువ రూ.80 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. పలు నివాసాల్లో బస్తాల్లో పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. వైసీపీ నాయకుల నివాసాల్లోనే మద్యం స్వాధీనమైనట్లు తెలుస్తోంది.