ఆసక్తి పెంచుతున్న ‘మంగళవారం’ టీజర్

Rx100 ఫేమ్ పాయ‌ల్ రాజ్ పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తోన్న చిత్రం మంగ‌ళ‌వారం. ఈ చిత్రాన్ని దర్శకుడు అజయ్ భూపతి తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేసి సినిమా ఫై ఆసక్తి పెంచారు డైరెక్టర్ అజయ్.

RX100 తో తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన పాయల్…మొదటి సినిమాతోనే యూత్ ను కట్టిపడేసింది. లిప్ లాక్ లు , భారీ అందాల ఆరబోత తో యూత్ కు నిద్ర లేకుండా చేసింది. ఆ తర్వాత అమ్మడికి పలు ఛాన్సులు వచ్చినప్పటికీ అవేవి కూడా పెద్దగా విజయం సాధించలేకపోయింది. దీంతో ఛాన్సులు కూడా తగ్గిపోయాయి. కాకపోతే సోషల్ మీడియా లో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఫాలోయర్స్ ను అలరిస్తూ వస్తుంటుంది. రీసెంట్ గా మాయాపేటిక తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం పాయల్ ఆశలన్నీ మంగళవారం మూవీ పైనే ఉన్నాయి. ఈ సినిమా తాలూకా ఫస్ట్ లుక్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. పొలాల మధ్య బటర్ ఫ్లైస్ గుండ్రంగా ఎగరడంతో ప్రారంభమైన ఈ టీజర్లో మొదట ఓ అమ్మవారి ఆలయాన్ని చూపించారు. ఆ తర్వాత అందరూ ఏం జరగబోతుందా అన్న భయంతో పైకే చూస్తున్నట్లుగా కనిపించారు.

ప్రతి షాట్లోనూ అందరి కళ్లనే హైలైట్ చేస్తూ వారందరూ భయంతో చూస్తున్నట్లుగా చూపించారు. మధ్య మధ్యలో పాయల్కు సంబంధించిన బోల్డ్ అండ్ సీరియస్ ఎమోషనల్ షాట్స్ను చూపించారు. ఆమె ఏడుస్తూ కోపంతో అరుస్తున్నట్టుగా కూడా చూపించారు. కానీ ఆమె పాత్ర ఏంటనేది రివీల్ చేయలేదు. ఇక టీజర్ చివరికి వచ్చేసరికి ఎవరో ఓ వ్యక్తి ముఖానికి అమ్మవారి మాస్క్ వేసుకోవడం ఆసక్తి రేపింది. ఓవరాల్ గా టీజర్ మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటుంది. మరి సినిమా ఎలా ఉంటుందనేది చూడాలి.

YouTube video