రేపు పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారం

మెగా హీరో వరుణ్ తేజ్..రేపు బాబాయ్ కోసం ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయిన పవన్..ఈసారి మాత్రం పిఠాపురంలో నిల్చుని విజయం ఫై ధీమాగా ఉన్నారు. ఇప్పటికే ఇక్కడ ప్రచారం చేసిన పవన్..ఓటర్లను గెలిపించాలని..తనను గెలిపిస్తే రాష్ట్రంలోనే నెం 1 గా పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తానని..అనేక హామీలు ఇచ్చారు.

ఇక ఇప్పుడు బాబాయ్ ను గెలిపించాలని ఓటర్లను అడిగేందుకు వరుణ్ తేజ్ వస్తున్నారు. రేపు పిఠాపురంలో ప్రచారం చేయబోతున్నారు. గొల్లప్రోలు రూరల్ మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం ప్రారంభం కానున్న రోడ్ షో.. వన్నెపూడి, కొడవలి, చందుర్తి, దుర్గాడ మీదుగా కొనసాగనుంది. ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటన చేసింది.

ఈసారి ఎన్నికల్లో అందరి దృష్టి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంపైనే ఉంది. ఎందుకంటే ఇక్కడ పవన్‌ను ఓడించాలని వైసీపీ గట్టిగానే ప్లాన్ చేస్తుంది. అయితే ఎలాగైనా పవన్ కళ్యాణ్‌ను గెలిపించుకునేందుకు జనసేన సహా కూటమి కృష్టి చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే పవన్ కోసం హైపర్ ఆది, గెటప్ శీను, ఆర్కే నాయుడు, జానీ మాస్టర్ వంటి వాళ్లు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా పిఠాపురంలో ప్రచారానికి నడుం కట్టారు.