నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరోపణలు

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పలు విధ్వస ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బిఆర్ఎస్ , కాంగ్రెస్ శ్రేణుల మధ్య పరస్పరం దాడులు , గొడవలు , రాళ్లు విసురుకోవడం వంటి ఘటనలు నమోదు అవుతున్నాయి. తాజాగా చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఫై కాంగ్రెస్ శ్రేణులు దాడికి దిగడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తనకు కాంగ్రెస్ నేతల నుండి ప్రాణహాని ఉందని ఆరోపించారు.

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో సుంకె రవిశంకర్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగారు. ఇక దాడి అనంతరం రవిశంకర్ మాట్లాడుతూ.. నీలోజిపల్లి గ్రామంలో నాపై దాడికి ప్రయత్నిస్తే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాపాడారని..ఇప్పుడు మరోసారి దాడికి దిగారని అన్నారు. తన గెలుపును తట్టుకోలేక కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం తనను చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని రవి శంకర్ ఆరోపించారు. గతంలో రెండుసార్లు దాడి చేసారని..కాంగ్రెస్ నుండి తనకు ప్రాణ హాని ఉందని తనను రక్షించాలని పోలీసులను కోరారు.