జనసేన కు శుభవార్త తెలిపిన ఈసీ

జనసేన పార్టీ కి గుడ్ న్యూస్ తెలిపింది ఈసీ. జనసేన పార్టీ కి గాజు గ్లాసును కామన్ గుర్తుగా కేటాయిస్తూ EC ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో జనసేన పోటీ చేయని చోట్ల ఇతరులకు ఈ గుర్తు కేటాయించే అవకాశం ఉండదు. అధికారంలో ఉన్న వైసీపీపార్టీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్‌ కల్యాణ్‌ టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్‌ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఎన్నికల ప్రకటన విడుదలైన కూడా జనసేన పార్టీకి గుర్తు కేటాయింపుపై ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోవడంతో జనసేన పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. అన్‌రిజర్వ్‌డ్‌ జాబితాలో గాజు గ్లాసును పేర్కొనడంతో ఆ గుర్తు లభిస్తుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.ఆ గుర్తు ఎలాగైనా తమకు దక్కేలా జనసేన పార్టీ తీవ్రంగా కృషి చేసింది. ఇప్పుడు జనసేన కు అనుకూలంగా ఆదేశాలు రావడంతో జనసేన శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.