కరోనా బారిన పడిన నటి వరలక్ష్మి శరత్ కుమార్

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారో బుసలు కొడుతూనే ఉంది. కరోనా వాక్సిన్ వేసుకున్నప్పటికీ కూడా ఈ మహమ్మారి వదలడం లేదు. ఇప్పటికే పలువురు సినీ , రాజకీయ నేతలు రెండోసారి కరోనా బారినపడగా..తాజాగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్నీ స్వయంగా ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.

స్వల్ప లక్షణాలు ఉండడంతో నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయ్యినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని సూచించింది. గత రెండు, మూడు రోజులుగా తనతో ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించింది. ఇక ఆమె త్వరగా కోలుకోవాలని ఆమె పోస్ట్ కు డైరెక్టర్ గోపీచంద్ మలినేని కామెంట్ చేశారు.

ప్రస్తుతం వరలక్ష్మి తెలుగు చిత్రాలతో బిజీగా ఉన్నారు. గత ఏడాది క్రాక్, నాంది వంటి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకొని మంచి పేరును సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తుండడంతో ఈ బ్యూటీ చెన్నై నుంచి హైదరాబాద్ కు కొద్ది రోజుల క్రితమే మకాం మార్చారు.