సీఎం జగన్‌ ఫై దాడి ఫై ఈసీ ఆరా

ఏపీ సీఎం జగన్ ఫై శనివారం రాత్రి దాడి జరిగిన సంగతి తెలిసిందే. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా సింగ్‌నగర్‌కు చేరుకున్న క్రమంలో జగన్‌పై రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో జగన్‌ కనుబొమ్మకు తాకింది. ప్రస్తుతం జగన్ రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ దాడిఫై ఈసీ అరా తీస్తుంది.

దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. చిలకలూరిపేటలో జరిగిన ప్రధాని సభ, సీఎం రోడ్‌షోలో భద్రతా వైఫల్యంపై ప్రశ్నలు సంధించింది. రాజకీయ హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రధాని సభలో భద్రతా వైఫల్యంపై ఇప్పటికే ఐజీ, ఎస్పీలపై బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. జగన్‌ రోడ్‌ షోలో జరిగిన ఘటనపైనా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే అవకాశముంది.