చంద్రబాబే జగన్‌పై దాడి చేయించాడు – సజ్జల ఆరోపణ

జగన్ ఫై జరిగిన దాడి ముమ్మాటికీ చంద్రబాబు చేయించేందే అన్నారు వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి. ఏపీ సీఎం జగన్ ఫై శనివారం రాత్రి దాడి జరిగిన సంగతి తెలిసిందే. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా సింగ్‌నగర్‌కు చేరుకున్న క్రమంలో జగన్‌పై రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో జగన్‌ కనుబొమ్మకు తాకింది. ప్రస్తుతం జగన్ రెస్ట్ తీసుకుంటున్నారు.

ఈ దాడి ఫై సజ్జల స్పందిస్తూ..జగన్ పైన జరిగిన దాడి హత్యాయత్నమే అని , సరిగ్గా కణతి చూసి గురి చూసి దాడి చేశారని.. కొంచెం తేడా వచ్చినా ప్రాణం పోయేదని అన్నారు. చంద్రబాబే ఈ దాడి చేయించారని సజ్జల తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ బస్సు యాత్రకు వస్తున్న ఆదరణను సహించలేక చంద్రబాబు ప్రీ ప్లాన్డ్ అటాక్ చేయించారని సజ్జల ఆరోపించారు. జగన్ కు సున్నితమైన భాగంలో గాయం అయిందని.. కనుబొమ్మకు ఇంకాస్త కింద రాయి తగిలి ఉంటే కన్ను పోయి ఉండేదని అన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే వెల్లంపల్లికి కనుగుడ్డు పోయిందని సజ్జల అన్నారు. సీఎం జగన్ కు తగిలిన రాయి వెల్లంపల్లికి కూడా తగిలి ఆయన కన్ను దెబ్బతిన్నదంటే ఎంత బలంగా దాడి ప్రయోగించారో తెలుసుకోవచ్చని అన్నారు. దాడి చేయడం కోసం నిందితులు ఎయిర్ గన్ దాడి ఉండవచ్చని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు.