అంబేడ్కర్‌కు నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

అంబేద్కర్‌ జయంతి సందర్బంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్‌ జయంతి వేడుకలు జరిపారు. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొని అంబేద్కర్‌ కు నివాళ్లు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..అంబేడ్కర్‌ అందించిన సేవలను నేతలు కొనియాడారు. కొంతమంది అంబేడ్కర్‌ పేరును అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నారని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశిరావు విమర్శించారు. రాజ్యాంగానికి బిజెపి తూట్లు పొడిచిందన్నారు. మూడోసారి ఆ పార్టీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆరోపించారు.

సమానత్వం కోసం పోరాడిన మహనీయుడు అంబేడ్కర్‌ అని కోదండరామ్‌ అన్నారు. సామాజిక, ఆర్థిక రంగాల్లో సమానత్వం లేకపోవడానికి బిలియనీర్లే కారణమని విమర్శించారు. ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని.. సరైన నాయకులను ఎన్నుకోవాలని కోరారు.