మేలిమి మానవ వనరులు సత్వరాభివృద్ధికి దారులు

వ్యవసాయ, పారిశ్రామిక, సాంకేతిక రంగం కీలకం

Human Resources
Human Resources

నిజమైన మానవ వనరులు విరివిగా తయారవుతూ దేశం సుఖ శాంతులతో చక్కని జీవన విధానాన్ని కలిగి ఉంటూ సుభిక్షంగా ఉంటుంది.

అందుకే దేశాభివృద్ధిలో వ్యవసాయరంగం, పారిశ్రామికరంగం, సాంకేతికరంగంతోపాటు మానవాభివృద్ధి సూచికలు అమిత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఆర్థికాభివృద్ధితో పాటుగా మానవాభివృద్ధి, మానవవనరుల అభివృద్ధి ఏ దేశంలో ఉంటే ఆ దేశం వాస్తవిక అభివృద్ధిని సాధించినట్లు.

కనుక రేపటి దేశాభివృద్ధికి కావలసిన మానవ వనరులను తయారు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే సింహభాగం.

గురువులు, ప్రభుత్వరంగ సంస్థలు, సమాజం, ఇతర స్వచ్ఛంద సంస్థలు ఎక్కడికక్కడ అవకాశమున్న ప్రతీ చోట పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించి వారిని ప్రజోపయోగకులుగా తయారు చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.

సాం కేతికత అన్ని రంగాల్లో విరివిగా విస్తరిస్తున్నది. ఆధునిక యుగంలో ప్రతీది సాంకేతికతతో ముడిపడి విద్య, వైద్యం లాంటి ప్రముఖ రంగాలతోపాటు వ్యక్తిగత జీవన విధానంపై అమితమైన ప్రభావాన్ని కలిగిస్తున్నది.

సమాచార విప్లవం దరిమిలా సాంకేతిక వస్తువుల వాడకం అనివార్యమై, నిత్యకృత్యంగా మారుతున్నది.

సమాచార, సాంకేతిక విప్లవ ప్రభావం వలన జీవన విధానంతోపాటు, రోజువారీ కార్యక్రమా లు సైతం సాంకేతికతపై ఆధారపడడం మూలానా తల్లిదండ్రులు పిల్లల పెంపకంపై తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.

పితృదేవోభవ, మాతృదేవోభవ, ఆచార్య దేవోభవగా చెప్పుకుంటాం. తండ్రి,తల్లి గురువ్ఞల ప్రభావం పిల్లల పెంపకం లో ఎనలేని పాత్ర ఉంటుంది.

కానీ క్రమేపీ స్నేహితుల ప్రభావం, ఆధునిక సాంకేతిక వస్తువుల ప్రభావం ముఖ్యంగా చరవాణి వాడకం, అందులో అంతర్జాలంలో పలు కార్యక్రమాలు వీక్షిం చడం, వినోదం కోసం ఆటలు ఆడడం లాంటివి పిల్లల పెంప కంపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతున్నాయి.

అంతేకాకుండా వినోదం పేరుతో వీక్షించే టెలివిజన్‌ కార్యక్రమాలు, ఇతర దృశ్య కార్యక్రమాలు, సినిమాలు పిల్లల ఎదుగుదలను ప్రభావితం చేస్తున్నాయి.

ఇలాంటి తరుణంలో తల్లిదండ్రులు పిల్లలు పెంప కం పట్ల జాగరూకత వహించకపోతే పిల్లలు పెడదారినపడే అవకాశమున్నది

. ప్రపంచంలో, దేశంలో సాంకేతికత విరివిగా విస్తరిస్తూ ప్రపంచమంతా కుగ్రామంగా మారిపోయింది. విశ్వంపై ఎక్కడ ఏది జరిగినా క్షణాల్లో సమాచారం చేరిపోతున్న క్రమం లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి లేకపోతే ముప్పు పొంచి ఉంటుంది.

పిల్లల పెంపకం పట్ల భారతీయ సంస్కృతి, కుటుంబ వ్యవస్థ ఎనలేని ప్రభావాన్ని కలిగి ఉండి, వారిని సక్రమమైన మార్గంలో నడిపించేలా ఉండేది.

కానీ నేడది విదేశీ సంస్కృతి సంప్రదాయాలు అధికమవడం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగైపోవడం, తల్లిదండ్రులు ఇరువురు ఆర్థిక అవసరాల రీత్యా ఉద్యోగాలు చేయవలసి రావడం వలన పిల్లల ఆలనా, పాలనా పెంపకం సక్రమంగా జరగడం లేదు.

అంతేకా కుండా సమాచారం కోసం ఉపయోగించాల్సిన చరవాణి, అంత ర్జాలంలో సమాచార వ్యాప్తితోపాటు చిరుమెదళ్లను కలుషితం చేసే అనవసర సమాచారం పుంఖాను,పుంఖానులుగా ఉచితంగా లభించే అవకాశంతో చిరుమెదళ్లు చిద్విలాసంతో చిన్నాభిన్నం అవుతున్నాయి.

ఆధునిక వస్తువ్ఞల వాడకం అనివార్యమవ్ఞతున్న తరుణంలో అనవసర సమాచారాన్ని వీక్షించే అవకాశానికి అడ్డు కట్టవేయకపోతే ఆధునికత తల్లిదండ్రులను కుటుంబాలను, సమాజాన్ని చిన్నాభిన్నం చేసే అవకాశం లేకపోలేదు.

చిరు ప్రాయంలో చిద్విలాసముతో సమాజాన్ని అవగాహన చేసుకొని మంచి పౌరులుగా ఎదగడానికి కావలసిన విద్యను సరైన రీతిలో అభ్యసించక, అభ్యసించినా సత్ప్రవర్తన కలిగి ఉండక, సమాజం లో అశాంతి నెలకొనే ప్రమాదం లేకపోలేదు.

దేశంలో విద్యా విధానం పట్ల కొంత మంది అసంతృప్తిని వెళ్లబుచ్చుతుంటారు. కానీ తల్లిదండ్రులుగా వారికి విద్యావిధానం గురించి, విద్యలోని సారాన్ని గురించి విడమర్చి చెప్పడంలో సఫలీకృతం కాలేకపోతు న్నారు.

దానికి పలు కారణాలు లేకపోలేదు కానీ విద్యావంతులు అయిన తల్లిదండ్రులు సైతం ఎంతమంది తమ పిల్లల పెంపకం పట్ల శ్రద్ధ వహిస్తున్నారన్నది ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉన్నది.

అంతేకాకుండా పిల్లల పెంపకంలో విద్యావిధానంలోని లోపాలను ఎత్తి చూపుతున్నాం. కానీ తల్లిదండ్రులకు ఉన్న వివిధ కార్యకలా పాల వలన వారిని నిర్లక్ష్యం చేస్తున్నారు

. వారికి సమాజం పట్ల సంబంధబాంధ్యవాల పట్ల సంస్కృతీ, సాంప్రదాయాల వల్ల వాటి గొప్పతనం పట్ల వివరించడంలో శ్రద్ధచూపడం లేదు. తద్వారా పిల్లలకు ప్రతీది ఆర్థికసంబంధాలుగా, అవసరంగా మారి వారి ధోరణిలోనూ అదే గోచరిస్తున్నది.

వ్యవస్థ అభివృద్ధి కంటే వ్యక్తి అభివృద్ధికే ప్రాధాన్యమిస్తూ తాము చేసింది, తాము ఆచరించేది, తాము నడిచేది నిజమని భ్రమపడుతూ వక్ర మార్గంలో పయనించడం జరుగుతున్నది.

అందుకు తల్లిదండ్రులు నిత్యం నిఘాపెడుతూ అనుమానం కంటే,అవగాహన చేసు కొనేలా వారితో వ్యవహరిస్తూ సన్మార్గంలో పయనించేలా చూడ వలసి ఉంటుంది.

ఇటీవలి కాలంలో పిల్లల విద్యావిధానంలో వారి బడి వాతావరణం కూడా కాంక్రీట్‌ గోడల మధ్య నలిగి పోతూ విశాల ప్రపంచాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉండటం లేదు.

పిల్లలకు ఆటలంటే ఎనలేని ప్రాణం. అలాంటి ఆటలు సైతం అంతర్జాలంలో ఆడుతూ మానసికంగా ఎదగాల్సిందిపోయి మానసికంగా ఒత్తిడికి గురి అవ్ఞతున్నారు.

అదే పాఠశాలలో చక్కని క్రీడా మైదానం ఉంటే అక్కడ ఆడే ఆటలలో మానసిక ఉల్లాసంతోపాటు శారీరక శ్రమ కలిగి వారి ఎదుగుదలకు తోడ్పడుతుంది.

అంతేకాకుండా వారిలో చక్కని క్రీడాస్ఫూర్తి పెంపొందుతుంది. తద్వారా గెలుపు,ఓటములను క్రీడా స్ఫూర్తితో స్వీకరించి మానసిక ఒత్తిడికి లోనుకాకుండా ఉంటుంది.

కనుక పాఠశాలల్లో తప్పనిసరిగా చక్కటి క్రీడామైదానం కలిగి ఉండి, వారికి ఆటలపట్ల ఆసక్తి కలిగేలా వాటివల్ల కలిగే ప్రయోజనా లను వివరిస్తూ ఆటలు మైదానంలో ఆడించాలి

. పిల్లలు వారి వారి పాఠ్యపుస్తకాలలో చదువ్ఞకున్న అంశాల పట్ల వాస్తవికతను జోడించి అర్థం చేయించే ప్రయత్నం చేయాలి.

సమాజంలో ఉన్నటువంటి జీవనవిధానం, వృత్తులు, వ్యవస్థ, పరిపాలనా విధానం గురించి వారిని ఆయా ప్రదేశాలకు తీసుకువెళ్లి ప్రత్యక్షం గా వారికి వివరించేలా తగు ఏర్పాట్లు చేయాలి.

అలాకాకుండా ఏ పనినైనా చేయవద్దని చెప్పేటప్పుడు దానివల్ల కలిగే పర్యవసానాలను వివరించి వద్దని చెప్పే ప్రయత్నం చేయాలి.

ఇలా చెప్పేక్రమంలో మొదటి దశలో అర్థంకాకపోయినా క్రమేపి దాన్నిఅర్థం చేసుకునేప్రయత్నం చేస్తూ తల్లిదండ్రులు లేనప్పుడు సైతం ఆ పనిచేయకుండా అదుపులో ఉండే అవకాశముంటుంది.

పిల్లల పెంపకంలో దృశ్యమాధ్యమాల ప్రభావం విరివిగా ఉంటుంది. దృశ్యమాధ్యమాలలో వచ్చే కార్య క్రమాలను అనుకరించే ప్రయత్నం చేసి అభాసుపాలవుతారు.

కనుక తల్లిదండ్రులు దృశ్యమాధ్యమాలను చూసేటప్పుడు తప్పని సరిగా పిల్లలను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలను వీక్షించాలి.

సాధ్యమైనంతవరకు తక్కువగా వీక్షించితేనే మంచిది. ఎందుకంటే వినోదం కోసంవీక్షించే కార్యక్రమాలు విషాదాలకుపాల్పడే విధంగా ఉంటున్నాయి.

కాబట్టి నియంత్రించుకోవడం మంచిది. అలాగే చరవాణి వాడకంలోనూ తల్లిదండ్రులు తమ పిల్లలకు చరవాణిని అప్పగించి తమ రోజువారీ పనులను చేస్తూఉంటారు.

చరవాణి లో అనేక కార్యక్రమాలు పిల్లలు త్వరగా ఆకట్టుకునేలా ఉంటూ వారి చిరుమెదళ్లను నూతన విజ్ఞానం పేరుతో అసాంఘిక కార్యకలాపాలపై మొగ్గుచూపేలా ఉంటు న్నాయి. కనుక సాధ్యమైనంత మేరకు పిల్లలను చరవాణికి దూరంగా ఉంచడం మంచిది.

కానీ కొంత మంది తల్లిదండ్రులు అందుకు విరుద్ధంగా వారి చేతికే చరవాణిని అప్పగించి వారు తమతమ పనులలో నిమగ్నం అవుతున్నారు. ఇలా అనేక అంశాలలో పిల్లల పెంప కం తల్లిదండ్రుల కార్యకలాపాలపైన ఆధారపడి ఉన్నది.

కనుక తల్లిదండ్రులు తప్పనిసరిగా అనునిత్యం తగు జాగ్రత్తలు తీసుకొంటూ పిల్లలతో స్నేహపూరిత వాతావరణం కలిగి ఉంటూ నిత్యం వారి కదలికలపై నిఘా ఉంచాలి.

కానీ నిఘా ఎప్పుడూ అనుమానించేదిగా ఉండకూడదు.

ఇలా పిల్లల పెంపకంపట్ల తగు జాగ్రత్తలు తీసుకోవడం వలన దేశాభివృద్ధికి కావలసిన నిజమైన మానవ వనరులు విరివిగా తయారవ్ఞతూ దేశం సుఖ శాంతులతో చక్కని జీవన విధానాన్ని కలిగి ఉంటూ సుభిక్షంగా ఉంటుంది.

అందుకే దేశాభివృద్ధిలో వ్యవసాయరంగం, పారిశ్రామికరంగం, సాంకేతికరంగంతోపాటు మానవా భివృద్ధి సూచికలు అమిత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఆర్థికాభివృద్ధితో పాటుగా మానవాభివృద్ధి, మానవవనరుల అభివృద్ధి ఏ దేశంలో ఉంటే ఆ దేశం వాస్తవిక అభివృద్ధిని సాధించినట్లు.

కనుక రేపటి దేశాభివృద్ధికి కావలసిన మానవ వనరులను తయారు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే సింహభాగం.

గురువులు, ప్రభుత్వరంగ సంస్థలు, సమాజం, ఇతర స్వచ్ఛంద సంస్థలు ఎక్కడికక్కడ అవకాశమున్న ప్రతీ చోట పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించి వారిని ప్రజోపయోగకులుగా తయారు చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.

  • సంవేదన

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/