ఇంకా ఎన్నాళ్లు…వివక్ష

ఏడాదిలో 3 లక్షలకు పైగా అఘాయిత్యాలు

Many more discrimination against girls…

బాలికల్లో శారీరక దృఢత్వంతోపాటు మానసిక స్థయిర్యం కూడా కల్పించే దిశగా అడుగువేయాలి. స్త్రీలు ఆర్థికంగా ఎదగాలి. ఆరోగ్యంగా ఉండాలి. అనుబంధం ఆమెకు ఆహ్లాదం పెంచాలి. ఆనందం ఆమె సొంతమవ్వాలి.

ఆడపిల్లలపై పుట్టుకముందే మొదలవ్ఞతున్న వివక్ష వృద్ధాప్యం వరకూ కూడా ఏదోరూపంలో కొనసాగుతూనే ఉంది. మహిళలపై దేశవ్యాప్తంగా ఒక్క ఏడాదిలోనే 3.5లక్షలకు పైగా అఘాయిత్యాలు జరిగాయి.

ఈ సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది గాని తగ్గడం లేదు. లింగనిష్పత్తిలో బడి చదువ్ఞల్లో ఉన్నత చదువులను అందుకోవడంలో ఉద్యోగాల్లో, వేతనాల్లో చట్టసంస్థల్లో, రాజకీయ ప్రాతినిధ్యంలో మహిళలు వెనుకబడి ఉన్నారు. ఇదిగాక వివక్ష గృహహింస, లైంగిక వేధింపులు, అత్యాచారాలు ఏ గుర్తింపు లేని ఇంటి చాకిరీ విషయంలో బాధల్లో ముందున్నారు.

ఆడపిల్లలు మహిళలు ఎదుర్కొనే చాలా సమస్యలు కొత్తకొత్త చట్టాలతోనో, శిక్షలతోనో పరిష్కారమైపోయేవి కావ్ఞ. వాటి మూలాలు, పరిధి మన సమాజంలో, కుటుంబాల్లో లోతుగా విస్తరించుకొని ఉన్నాయి.

పరిస్థితిని చక్కదిద్దేందుకు మనం చేసే కృషి కుటుంబాల నుంచి ఇంటి నుంచే ఆరంభం కావాలి. ఆకాశంలో సగం, సమాజంలో సగం అనేవిధంగా బాహ్యప్రపంచంలో పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణిస్తూ జనాభాలో సైతం సమానంగా ఉన్న మహిళలు నేటికీ ద్వితీయశ్రేణిపౌరులుగానే రాణిస్తున్నారు.

ఒకప్పుడు వంటింటి కుందేళ్లుగా, తండ్రుల చాటు బిడ్డలుగా, భర్తల చాటు భార్యలుగా వ్ఞంటూ ప్రతి విషయంలో స్వంత నిర్ణయాలు తీసుకోలేక స్వంత వ్యక్తిత్వాన్ని చంపుకొని ఆత్మగౌరవాన్ని అణచుకొని ఒకప్పుడు అణిగిమణిగి వ్యవహరించిన అబలలు నేడు సబలలుగా మారారు.

ప్రపంచంలో ఏ మూలనైనా, ఏదేశంలోనైనా, ఏ సమాజంలోనైనా స్వేచ్ఛగా నిర్భయంగా, నిస్సంకోచంగా మహిళలు సంచరిస్తున్న, జీవిస్తున్న దాఖలాలు కనిపించవ్ఞ. చరిత్ర పొడుగునా ఆడవాళ్ల జీవితం ఆంక్షలమయం బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కొడుకుల రక్షణలో ఉండాలని సమాజం చెబుతోంది.

పితృస్వామ్యం గీసిన పరిధుల్లోనే ఆడవాళ్ల ఆలోచనలు, బతుకులు ఇమిడిపోవాలనే రీతి కొనసాగుతున్నది. ఆడవాళ్లపై అత్యాచారాలు, హింస, నేరాలు తాగిన స్థితిలో చేసినవి ఎక్కువగా ఉండటం బహిరంగమే.

నేటి సమాజంలో సురక్షతంగా మహిళలపై జరుగుతున్న నేరాలపట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటే నిర్దిష్టమైన సామాజిక నిర్మాణ ఆవశ్యకత ఎంతో ఉంది. లింగవివక్షపైనా దాని నిరోధక చట్టాలపైనా యుక్తవయసు నుంచే పిల్లల్లో అవగాహన పెంచాలి.

దేశం, భాషలు వేరైనా మహిళలందరి సమస్యలు ఒక్కటే. అభివృద్ధి నిరోధక, ఛాందస భావాలకు వ్యతిరేకంగా మహిళ సమస్యల పరిష్కారం కోసం పోరాడడం ద్వారా స్త్రీ స్వేచ్ఛగా, సమానత్వం సాధించగలరు.

ఎక్కడైనా మహిళల అభిప్రాయాలకు, సొంత ఆలోచనలకు గౌరవం, స్వాతంత్య్రం లేకో అక్కడ వారి స్వేచ్ఛకు సంకెళ్లు వేశారని అర్ధం. స్వేచ్ఛముందు సంకెళ్లు చిన్నవని ప్రతి మహిళ గ్రహంచాలి.

మన దేశంలోనే కాదు దాదాపు ప్రపంచమంతా మహిళలపై వివక్ష కొనసాగుతోంది. మహిళలకు ఎన్నో హక్కుల ఉన్నాయి. అయినా జీతాలు, పదవ్ఞల్లో అన్యాయం జరుగుతోంది. అంతేకాదు. మహిళలపై కొన్ని ప్రత్యేక అణచివేతలు కూడా కొనసాగుతున్నాయి.

బాల్యవివాహాలు,వేతనాల్లో దారుణమైన అసమానతలు, వితంత్రువ్ఞలపై వివక్ష ఆస్తిలో వాటా ఇవ్వకపోవడం వంటి నేరాలు ప్రత్యేకమైనవి. మహిళలకు రాజ్యాంగం ఎన్నో హక్కులు కల్పించినా వాటిపై సరైన అవగాహన లేకపోవడం తెలియకపోవడం అన్యాయాలకు గురవ్ఞతున్నారు.

మహిళలపై హింసకు అరికట్టేందుకు కఠినమైన చట్టాలు ఉన్నాయి. వాటి అమలు పక్కగా జరగాలి. అలాంటి వాటిల్లో గృహహింస చట్టం 2005 ఒకటి ఇది వివాహబంధంలో ఉండి హింసకు గురవ్ఞతున్న మహిళలకు వర్తిస్తుంది.

అధికకట్నం, పుట్టింటి ఆస్తిలో భాగం, విలాసాలకు డబ్బు తీసుకురావాలని అడగడం, వివాహేతర సంబంధాలతో చిత్రవధకు గురిచేయడం వంటివి నేరాలుగా పరిగణిస్తారు. నేర నిరూపణ అయితే ఒక్క సంవత్సరం జైలు శిక్ష 20వేల రూపాయలు జరిమానా విధిస్తారు.

రెండోది నేర సంబంధిత న్యాయసవరణ చట్టం 2013 యాసిడ్‌ దాడులు లైంగిక వేధింపులు, అత్యాచారం వంటివన్నీ నేరాలుగా పరిగణిస్తారు.

సెక్షన్‌ 354 (ఎ) కింద లైంగిక హింస, దౌర్జన్యం, అశ్లీల చిత్రాల ప్రదర్శన వంటివాటికి మూడు నుంచి ఐదేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. చిన్నవయసులోనే ఆడవాళ్లను మనుషులుగా చూసే చదువ్ఞ సంస్కారం నేర్పాలి.

విద్యావ్యవస్థలో ఇందుకు అనుకూలంగా పాఠాలు ఉండాలి. దేశంలో 2017లో మహిళలపై జరిగిన నేరాల్లో నమోదైనవి 3లక్షల 50వేలు. అందులో 7శాతం అత్యాచారాలు. వాస్తవంగా జరుగుతున్నవాటిలో ఇవి కేవలం పదిశాతమే.

అంటే ఏ స్థాయిలో నేరాలు జరుగుతున్నాయో ఊహించుకోవచ్చును.

కోర్టు దాకా వచ్చిన కేసుల్లో నిందితులకు శిక్ష పడినవి ముప్పైశాతానికి మించవ్ఞ. ఇంత నేరమయంగా ఉన్న సమాజంలో నేరస్తులకు భయంగనీ, బాధితులకు ఊరటగానీ ఎలా కలుగుతాయి.

బాధితులు, నిందితులు హోదాలతో సంబంధం లేని న్యాయప్రక్రియ జరగాలి. బాధితుల పూర్తి రక్షణకు ముద్దాయి లకు సత్వర శిక్షకు పూచి ఉండాలి. ఇంకా ఎన్నాళ్లు ఈ వివక్ష?

ఆర్‌విఎం సత్యం

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/