సడలింపులున్నా.. ఆంక్షలే!

లాక్‌డౌన్‌లో జీవనశైలి

lockdown period
lockdown period

లాక్‌డౌన్‌ సడలింపులు క్రమంగా ప్రారంభమయ్యాయి. ఇంతకాలంగా ఇంటికే పరిమితమైన వారంతా ఇక హాయిగా బయట తిరగవచ్చు అనుకుంటే పొరపడినట్లే.

ఎందుకంటు కరోనా మహమ్మారి ఇంకా పొంచి ఉంది. ఇక ఇప్పుడయితే ఇదివరకన్నా ఎక్కువ అప్రమత్తంగా ఉండాల్సి ఉంది.

ఇన్నిరోజులుగా స్నేహితుల్ని, బంధువులను కలకుండా ఉన్నాము కదా ఇప్పుడు ఇక ఎక్కడి కంటే అక్కడికి వెళ్లవచ్చు అనుకుంటుంటారు.

అయితే అందుకు మరికొంత సమయం ఆగాల్సి ఉంది. లాక్‌డౌన్‌ సడలింపులు మొదలైన వెంటనే ఇదివరకటి పరిస్థితులు వెంటనే సాధారణ స్థితికి రావు.

ఇప్పటికీ కరోనా ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదం పొంచి ఉందనే విషయం గుర్తుంచుకోవాలి.

మరీ ముఖ్యంగా కొన్ని పనులకు దూరంగా ఉండాలి. సాధారణంగా వేసవిలో సెలవు ఉంటాయి.

కాబట్టి విహారయాత్రలు, పిక్నిక్‌లు వెళ్లే వారు ఇంతకాలం ఉగ్గబట్టుకుని ఉండవచ్చు. కాని కొన్ని నెలలు వరకు కుటుంబసమేతంగా విహారయాత్రలకు వెళ్లడం మానుకోవాలి.

ప్రయాణ మాధ్యమాలు ఉన్నంత మాత్రాని జనసమ్మర్దం ఉండే ప్రదేశాలకు వెళ్లాలనుకోవడం సరియైనది కాదు. లాక్‌డౌన్‌ సడలింపులు కరోనా తగ్గుదలకు సంకేతాలు కావు.

కరోనా వైరస్‌ దాడి నుంచి కాపాడుకోవాలంటే మునుపటి లాగే తరచుగా చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. చేతులు శుభ్రంగా ఉంచుకునే అలవాటు అలవరచుకోవడం వల్ల కరోనాతో పాటు ఇతరత్రా వ్యాధికారక ఇన్‌ఫెక్షన్ల నుంచ రక్షణ పొందుతాం.

చాలారోజులుగా కలవలేకపోయినా స్నేహితులను కలిసి విందు, వినోదాలు చేసుకోవాలని ఉంటుంది. అలా అయితే పబ్‌లు, క్లబ్‌ల ద్వారా కరోనా ఇన్‌ఫెక్షన్‌ ప్రబలే ప్రమాదం ఉంది.

కాబట్టి మరికొంతకాలం పాటు స్నేహితులకు, సన్నిహితులకు దూరంగా ఉండాల్సిందే. జనసమ్మర్దం ఉండే ప్రదేశాలకు వెళ్లిన ప్రతిసారి తప్పనిసరిగా ఫేస్‌మాస్క్‌ వాడవలసిందే!

ఇంటికి చేరుకున్న తరువాత మాస్క్‌ను తొలగించి వెంటనే శుభ్రం చేసుకోవాలి.

ఈ జాగ్రత్తలన్నీ ఇంకొంత కాలం పాటిస్తేనే కరోనా మహమ్మారి నుండి మనల్ని మనం రక్షించుకోగలము.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/