జ్ఞాపక శక్తిని పెంచే వేరుశనగ..

ఆహారం ఆరోగ్యం

benefits of peanuts

ఇవి కొలెస్ట్రాల్ ను, రక్తంలో చక్కర స్థాయిని తగ్గిస్తాయి. గుండె జబ్బులను నిరోధిస్తాయి. జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తాయి. వీటిలో ఉన్న యాంటీ ఆక్సీడెంట్స్, ఫాటీ యాసిడ్స్ చర్మాన్ని సంరక్షిస్తాయి. పల్లీల్లోని పోలీ, మోనో ఆన్ సాచురేటెడ్ పాట్స్ , విటమిన్ బి 3 లు మెదడును ఆర్గ్యంగా ఉంచుతాయి. జ్ఞాపక శక్తిని పెంచుతాయి. వయసు రీత్యా వచ్చే అల్జిమర్స్ లాంటి సమస్యలను కూడా తగ్గిస్తాయని పరిశోధనల్లో తేలింది. మూడ్స్ ను క్రమ బద్ధం చేసి, యాంటీ డిప్రెసెంట్స్ గా పనిచేసే ఎమినో యాసిడ్స్ ను పల్లీలు అందిస్తాయి. వాటి వలన ఆందోళన తలెత్తదు..

వేరుశనగ ప్రోటీన్లు ఉన్న ఆహారం అయినందువలన ఆకలి తీరుతుంది.. ఇంకా ఇంకా తినాలన్న భావన లేక సంతుష్టి కలుగుతుంది.. దీంతో బరువు పెరగదు. రోజూ గుప్పెడు పల్లీలు తినటం వలన శరీరానికి అవసరమైన పోషకాలెన్నో అందుతాయి. అనేక అనారోగ్య సమస్యా నుంచి బయట పడొచ్చు. పల్లీలను వేయించి తింటే మరింత రుచిగా ఉండే మాట నిజం. కానీ, వీటిని ఉడికించి లేదా నానబెట్టి తినటమే మంచిది.. మొలకలు వచ్చాక, తింటే మరీ శ్రేష్టం. వీటికి కొంచెం బెల్లం జతచేసి తింటే పైత్యం చేయదు.. ఇన్ని లాభాలు చేకూర్చే పల్లీలను తగిన మోతాదులో తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇవి బాదాం, జీడీ పప్పుఆంత ఖరీదు కాదు.. కనుక అందరికీ అందుబాటులో ఉంటాయి .