ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు..

earthquake-jolts-assam-again

ఏపీ లోని ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని ముండ్లమూరులో ఆదివారం ఉదయం 10.15గంటలు ప్రాంతంలో 2 సెకండ్లు పాటు భూమి కంపించింది. వేంపాడు గ్రామాల్లో సైతం భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుండి భయంతో పరుగులు తీశారు.
భూమి కంపించడానికి ముందు భారీ శబ్దం వినిపించిందని కొంతమంది చెప్పారు. ఆ తర్వాత కాసేపటికే భూమి కంపించడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చామని వివరించారు.

ఈ ఘటనతో గ్రామస్థులలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో వరుసగా భూకంప ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఏడాది మార్చిలో కర్నూల్ జిల్లా తుగ్గలి మండలం రాతసలో భూమి కంపించింది. దీంతో గ్రామంలోని పలు ఇళ్ల గోడలు బీటలువారాయి. గ్రామంలోని పలు సిమెంట్ రోడ్లు దెబ్బతిన్నాయి. పులిచింతల ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో తరచుగా భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో జనం ఆందోళన చెందుతున్నారు.