సత్యం నాదెళ్ల – కేటీఆర్ ల మధ్య జరిగిన సంభాషణలు ఇవే

మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. నిన్న మోడీ ని కలిసిన సత్యం..ఈరోజు హైదరాబాద్ కు వచ్చిన ఆయనతో తెలంగాణ మంత్రి కేటీఆర్ స్నేహపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా కేటీఆర్ తెలిపారు.

ఈ నేప‌థ్యంలో కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో ఓ పోస్టు చేశారు. ఇద్ద‌రు హైద‌రాబాదీలు క‌ల‌వ‌డం శుభ‌దినం అవుతుంద‌ని మంత్రి కేటీఆర్ త‌న పోస్టులో పేర్కొన్నారు. స‌త్య నాదెళ్ల‌తో బిజినెస్‌, బిర్యానీ గురించి చ‌ర్చించిన‌ట్లు కూడా మంత్రి కేటీఆర్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలు, హైదరాబాద్ లో అవకాశాలు తదితర అంశాలను సత్య నాదెళ్లకు కేటీఆర్ వివరించినట్టు సమాచారం. లేటెస్ట్ టెక్నాలజీపై కూడా ఇరువురూ చర్చించినట్టు తెలుస్తోంది.

అలాగే బెంగళూరులో జరిగిన ఫ్యూచర్‌ రెడీ టెక్నాలజీ సమ్మిట్‌లో ‘చాట్‌ జీపీటీ’ అనే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఛాట్‌ రోబోను నాదెళ్ల పరిచయం చేశారు. ఆ రోబోతో ఆయ‌న మాట్లాడారు. భవిష్యత్తులో పాపులర్‌ సౌత్‌ ఇండియన్‌ టిఫిన్స్‌ ఏముంటాయని ఆయన చాట్‌ రోబోను ప్రశ్నించగా.. ఇడ్లీ, దోశ, వడ, బిర్యానీ అంటూ అది సమాధానమిచ్చింది. వెంటనే స్పందించిన సత్య నాదెళ్ల.. బిర్యానీని సౌత్‌ ఇండియా టిఫిన్‌ అని తనను అవమానించొద్దన్నారు. దీంతో వెంటనే చాట్‌ రోబో క్షమాపణ చెప్పింది.