యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం ..5 మంది మృతి

యూపీలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో పదిహేను మంది గాయపడ్డారు. జాలౌన్ జిల్లాలోని గోపాల్ పుర ప్రాంతంలో పెళ్లి బృందం తో వెళ్తున్న బస్సు ను గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో బస్సు బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.

వారంతా ఓ పెళ్లికి హాజరై తిరిగివెళ్తున్నారని పోలీసులు తెలిపారు. బస్సు బోల్తా పడడంతో ఐదుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. పదిహేను మందికి గాయాలు కావడంతో దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. బస్సులోని మిగతా ప్రయాణికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మాధోగఢ్ పోలీసులు తెలిపారు.