పవన్ కళ్యాణ్ కు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార – ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య సవాళ్లు , ప్రతిసవాళ్లు ఎక్కువైపోతున్నాయి. ఈసారి వైసీపీ గెలుపు కష్టమే అని పలు సర్వేలు తెలుపుతున్న వేళ..వారిలో ప్రస్టేషన్ ఎక్కువైపోతోంది. ఇక ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కాకినాడ నుండి పోటీ చేయబోతారనే వార్తలు ప్రచారం అవుతున్న వేళ..వైసీపీ కాకినాడ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి..పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు.

కాకినాడలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ..కనీసం గాజు గుర్తుతో తనపై పోటీ పెట్టాలని ఛాలెంజ్ చేశారు. తన సవాల్‌కు పవన్ కల్యాణ్ స్పందించాలని ద్వారంపూడి డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ కాకినాడలో పోటీ చేస్తే కచ్చితంగా ఓడిస్తానని హెచ్చరించారు. గతంలోనూ ఇదే చెప్పానని, ఇప్పుడూ అదే చెబుతున్నానని ద్వారంపూడి పేర్కొన్నారు. సీఎం జగన్ తనకు టికెట్ ఇవ్వకపోయినా వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. జగన్ కుటుంబంతో ఎప్పుడూ విధేయతగానే ఉంటామన్నారు. తన సీటును సీఎం జగన్ త్వరలో ప్రకటిస్తారని ద్వారంపూడి తెలిపారు.