ఏపీలో 16 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ

ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

అమరావతి : ఏపీ ప్రభుత్వం 16 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ గత అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన ఐపీఎస్ అధికారుల్లో కొందరికి పదోన్నతులు కూడా లభించాయి. ప్రస్తుతం విజయనగరం ఎస్పీగా ఉన్న బి.రాజకుమారి పదోన్నతిపై దిశ డీఐజీ (మంగళగిరి)గా నియమితులయ్యారు. దిశ ఎస్పీగా ఉన్న ఎం. దీపిక విజయనగరం బదిలీ అయ్యారు. విజయవాడ రైల్వే ఎస్పీగా ఉన్న సీహెచ్ విజయరావు నెల్లూరుకు, కృష్ణా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబు తూర్పుగోదావరికి, తూర్పు గోదావరి ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌గా బదిలీ అయ్యారు.

ప్రకాశం ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ కృష్ణాకు, చిత్తూరు ఎస్‌ఈబీ ఏఎస్పీ వై. రిషాంత్ రెడ్డి ఏఎస్పీ, అడ్మిన్, గుంటూరు రూరల్‌కు, నర్సీపట్నం ఓఎస్డీ ఎస్.సతీశ్ కుమార్ ఏఎస్పీ (ఎస్‌ఈబీ), చింతపల్లి ఏఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఏఎస్పీ (ఎస్‌ఈబీ), రంపచోడవరం ఏఎస్పీ జి.బిందుమాధవ్ ఏఎస్పీ (ఎస్‌ఈబీ), నర్సీపట్నం ఏఎస్పీ తుహిన్ సిన్హా ఏఎస్పీ, (ఎస్‌ఈబీ) గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ పి.జగదీశ్ ఏఎస్పీ, పాడేరు, గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ జి.కృష్ణకాంత్ ఏఎస్పీ చింతూరు, గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ వీఎన్ మణికంఠ చందోలు ఏ ఏఏస్పీ, నర్సీపట్నం, గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ కృష్ణకాంత్ పటేల్ ఏఎస్పీ, రంపచోడవరం, గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ తుషార్ దూడి చింతపల్లి ఏఎస్పీగా బదిలీ అయ్యారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/