కర్ణాటకలో ఒమిక్రాన్‌ కల్లోలం

దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ మహమ్మారి పంజా విసురుతుంది. ఒకటి రెండే కాదు ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఈ మహమ్మారి కేసులు పెరిగిపోతున్నాయి. తెలంగాణ లో ఇప్పటికే 20 కేసులు వెలుగులోకి రాగా..తాజాగా కర్ణాటకలో ఒమిక్రాన్‌ కల్లోలం సృష్టిస్తుంది. ఉడిపిలో రెండు, ధార్వాడ్, భద్రావతి, మంగళూరులో ఒక్కోటి చొప్పున ఒమిక్రాన్‌ కేసులు బయటపడ్డాయని కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ సుధాకర్ చెప్పారు.

దేశ రాజధాని ఢిల్లీలో 2, కర్ణాటకలో 5, కేరళలో 4 ఒమిక్రాన్‌ కేసులు సోమవారం బయటపడ్డాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 167 కేసులకు చేరింది. అయితే, 24 కొత్త వేరియంట్‌ బాధితుల్లో 12 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని ఢిల్లీ ఆరోగ్య విభాగం తెలిపింది.

ఇక మిగతా రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌ కేసులు ఎలా ఉన్నాయంటే..

మహారాష్ట్ర (54), ఢిల్లీ (24), రాజస్థాన్ (17), కర్ణాటక (19), తెలంగాణ (20), గుజరాత్ (11), కేరళ (15), ఆంధ్రప్రదేశ్ (1), చండీగఢ్ (1), తమిళనాడు (1) మరియు పశ్చిమ బెంగాల్ (4) వెలుగులోకి వచ్చాయి.