షర్మిళ చేరికతో కాంగ్రెస్ ఏపీలో బలోపేతమవుతుంది – మాణిక్కం ఠాగూర్

ys-sharmila-joins-congress-party

వైస్ షర్మిల నేడు కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. ఢిల్లీ వేదికగా రాహుల్ సమక్షంలో ఆమె తన YSRTP పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేసి..కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈమెతో పాటు పలువురు YSRTP నేతలు కాంగ్రెస్ లో చేరారు.

ఈ సందర్భంగా ఏఐసీసీ నేత మాణిక్కం ఠాగూర్ మాట్లాడుతూ.. వైఎస్ షర్మిళ చేరికతో కాంగ్రెస్ ఏపీలో బలోపేతమవుతోందని అన్నారు. నాయకుల చేరికతో ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి పునరుజ్జీవం లభించిందని ఆయన అన్నారు. అయితే, పార్టీలో చేరిన షర్మిళకు ఏ పదవి కట్టబెట్టాలో త్వరలో అధిష్టానమే నిర్ణయిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామంలో కాంగ్రెస్ ఏపీ మిషన్ ప్రారంభమైందని అన్నారు. ఏపీలో బీజేపీకి ప్రాంతీయ పార్టీలనీ అనుకూలమేనని ఆరోపించారు. రాష్ట్రానికి బీజేపీ తీరని ద్రోహం చేసిందన్నారు.