మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న శ్రీవల్లి

Rashmika Mandanna insta pics
Srivalli suffering from knee pain

Community-verified icon

వరుస బ్లాక్ బస్టర్ హిట్ల తో దూసుకెళ్తున్న రష్మిక..విపరీతమైన మోకాళ్ల నొప్పులతో బాధపడుతుంది. రీసెంట్ గా పుష్ప చిత్రంతో శ్రీవల్లి గా దేశ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ..పలు భాషల్లో సినిమాలు చేస్తూ క్షణమ్ తీరిక లేకుండా గడుపుతుంది. కాగా ఈమెను మోకాళ్ల నొప్పులు విపరీతంగా బాధపెడుతున్నాయట. దీంతో, హైదరాబాద్ లోని ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ గురువారెడ్డిని రష్మిక కలిసింది. ఈ విషయాన్ని డాక్టర్ గురువారెడ్డి స్వయంగా తెలిపారు. మోకాళ్ల నొప్పులతో బాధ పడుతూ రష్మిక తన వద్దకు వచ్చిందని, అయితే, కంగారు పడాల్సిందేమీ లేదని ఆయన తెలిపారు.

రష్మిక తన వద్దకు రావడంపై డాక్టర్ గురువారెడ్డి తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా ఫన్నీగా స్పందించారు. ‘సామీ… సామీ’ అంటూ బరువంతా మోకాళ్లపై వేసి ద్యాన్స్ చేయడం వల్లే మోకాళ్ల నొప్పులు వచ్చాయని కామెడీగా రష్మికతో చెప్పానని అన్నారు. ‘పుష్ప’ సినిమా చూసినప్పటి నుంచి రష్మికను కలిసి అభినందించాలనుకున్నానని… అయితే, మోకాలి నొప్పి వల్ల ఆమె తన దగ్గరకు వచ్చే అవకాశం కలుగుతోందని చెప్పారు. త్వరలోనే అల్లు అర్జున్ కూడా భుజం నొప్పితో వస్తాడేమోనని సరదా కామెంట్స్ చేసాడు.