6న ‘జగనన్న తోడు’ ప్రారంభం

చిరు వ్యాపారులకు పూచీకత్తు లేకుండా రూ.10 వేల చొప్పున రుణం

AP CM YS Jagan Mohan Reddy
AP CM YS Jagan Mohan Reddy

అమరావతి: సిఎం జగర్‌ ఏపిలో చిరు వ్యాపారులు, వీధుల్లో వస్తువులు, సంప్రదాయ వృత్తులు చేసుకునే వారికి వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు ఈ నెల 6వ తేదీన ‘జగనన్న తోడు’ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్‌ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పథకం కింద బ్యాంకుల నుంచి చిరు వ్యాపారులకు రుణాలు ఇప్పించడంతోపాటు ఆ రుణాలపై అయ్యే వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. తీసుకున్న రుణాన్ని మాత్రం వాయిదాల పద్ధతిలో లబ్ధిదారులు చెల్లిస్తే సరిపోతుంది. ఇందుకుగాను ప్రభుత్వం రూ.474 కోట్లను ఖర్చు చేయనుంది. ఈ రుణం మీద అయ్యే వడ్డీ రూ. 52 కోట్లను ప్రభుత్వంమే భరిస్తుంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/