మీము తప్పు చేసాం..క్షేమించండి – నారా లోకేష్

ఏపీలో ఎన్నికల సమయం ఇంకా ఉన్నప్పటికీ ఇప్పటి నుండే ప్రజల్లోకి వెళ్తున్నారు పార్టీ నేతలు. ప్రతిపక్ష పార్టీలతో పాటు , అధికార పార్టీ సైతం పలు కార్యక్రమాలతో ప్రజల్లో ఉంటున్నారు. తాజాగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉండవల్లి లో పర్యటించి అక్కడ ప్రజలను క్షేమపణలు కోరారు.

టీడీపీ హయాంలో పుష్కారాల సమయంలో.. సీతానగరం ఘాట్ దగ్గర ఉన్న ఇళ్లను తొలగించి.. వారికి ఉండవల్లి దగ్గర స్థలాలు ఇచ్చారు. అన్ని సదుపాయాలతో ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ అప్పుడు కుదరలేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో.. నారా లోకేశ్ వారు ఉంటున్న ప్రాంతానికి వెళ్లారు. వాళ్ల పరిస్థితి చూసి ఆవేదనకు గురయ్యారు.

‘మా ప్రభుత్వంలోనే మీకు ఇళ్లు, కరెంటు, సదుపాయాలు ఇచ్చి ఉంటే.. మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ పరిస్థితికి కారణం అయిన మమ్మల్ని క్షమించండి. చేతులు జోడించి అడుగుతున్నా’ అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు. మీరు ధైర్యంగా ఉండండి.. వచ్చేది మన ప్రభుత్వమే.. రాగానే అన్ని సదుపాయాలు సమకూరుస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.