అధ్యక్షుడు ట్రంప్‌కు కరోనా నెగిటివ్‌

trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కరోనా నుండి పూర్తిగా కోలుకున్నారు. వరుస పరీక్షలో ఆయనకు కొవిడ్‌ నెగెటివ్‌ వచ్చిందని శ్వేతసౌదం వైద్యుడు సీన్‌ కాన్లే సోమవారం వెల్లడించారు. వరుసగా అయిదురోజుల పాటు ఆయనకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తూ వచ్చారు వైట్‌హౌస్ ఫిజీషియన్లు. తాజాగా నిర్వహించిన టెస్టుల్లోనూ ట్రంప్‌కు నెగెటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. యాంటీజెన్ కార్డ్ ద్వారా అధ్యక్షుడికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు చెప్పారు.

అలాగే యాంటీజెన్ ద్వారా ఆయనకు పలుమార్లు కరోనా నిర్ధారణ పరీక్షలను చేపట్టినట్లు కాన్లే చెప్పారు. అలాగే వైరల్ లోడ్, ఆర్ఎన్‌ఏ, పీసీఆర్ విధానాలు వంటి అందుబాటులో ఉన్న అన్ని లాబొరేటరీ డేటాల ఆధారంగా డొనాల్డ్ ట్రంప్‌నకు కరోనా నెగెటివ్ వచ్చిందనే విషయాన్ని నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు. సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా ట్రంప్‌నకు వైద్య పరీక్షలను చేశామని, ఆయనలో సీజనల్‌గా సంభవించే ఏ ఇతర ఫ్లూ లక్షణాలు గానీ, వ్యాధులు గానీ కనిపించలేదని పేర్కొన్నారు.

దీంతో ట్రంప్‌ మరోసారి విడత ఎన్నికల ప్రచార ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నారు. ఇక మళ్లీ ఆరోగ్యం కుదుటపడటంతో ఆయన రెట్టించిన ఉత్సాహంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల ర్యాలీలో పాల్గొనడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్లోరిడాలో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొనబోతున్నారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత డొనాల్డ్ ట్రంప్ పాల్గొనబోయే తొలి ర్యాలీ ఇదే కానుంది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/