విజయనగరం జిల్లాలో ఘోరం : ట్యూషన్ కు వచ్చిన బాలికను గర్భవతి చేసిన టీచర్

విజయనగరం జిల్లాలో ఘోరం జరిగింది. ట్యూషన్ కు వచ్చిన బాలికను ప్రత్యేక శిక్షణ పేరుతో గర్భవతిని చేశాడో ట్యూషన్ మాస్టర్. విషయం తెలిసి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.

వివరాల్లోకి వెళ్తే .. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో పదో తరగతి చదువుతున్న బాలిక…గత మూడేళ్లు గా ఒకే ట్యూషన్ కు వెళ్తుంది, అక్కడి ట్యూషన్ చెప్పే టీచర్..ఆ బాలిక ఫై కన్నేశాడు. మిగతా విద్యార్థులందరూ వెళ్లిపోయిన తర్వాత ప్రత్యేక క్లాసుల పేరుతో ఆమెను అక్కడే ఉంచి..ఆమెను లోబర్చుకున్నాడు. బాలిక కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉండడం.. సరిగా అన్నం తినకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు బాలిక ఎనిమిదో నెల గర్భవతి అని చెప్పడంతో తల్లిదండ్రులు షాకయ్యారు. ఏమిజరిగిందని ఆరా తీయగా బాలిక జరిగిన విషయాన్నీ తెల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆ తల్లిదండ్రులుదిశ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు పంపారు.