మలేసియా ప్రధాని రాజీనామా

Malaysian-PM-Mahathir
Malaysian-PM-Mahathir

కౌలలాంపూర్‌: మలేషియా ప్రధాని మహతిర్‌ మహ్మద్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించి రాజీనామా లెటర్‌ను మలేసియా రాజుకు పంపారు. దాంతో ప్రధాన మంత్రి పదవికి మహతిర్‌ మహ్మద్ రాజీనామా చేసినట్టు ప్రధాని ఆఫీస్ ప్రకటించింది. ఆయన పార్టీ పర్తి ప్రభూమి బెర్సతు మలేసియా కూడా అధికార కూటమి నుంచి వైదొలిగింది. ఐతే… కొన్నాళ్లుగా… ప్రభుత్వాన్ని ఎలాగైనా దించేయాలని భాగస్వామ్య పార్టీలే యత్నిస్తున్నాయి. ముఖ్యంగా కూటమిలోని మరో నేత అన్వర్ ఇబ్రహీంకి పగ్గాలు అప్పగించాలని పార్టీలు కోరుతున్నాయి. ఇలాంటి సమయంలో… 94 ఏళ్ల మహతిర్… తాను ఇక కొనసాగలేనని నిర్ణయించుకున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/