తెలంగాణలో కొత్తగా 1,708 కేసులు నమోదు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,14,792

telangana-corona virus

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 1,708 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఐదుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,009 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,14,792 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,89,351 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,233 కు చేరింది. ప్రస్తుతం 24,208 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 277, రంగారెడ్డి జిల్లాలో 137 కేసులు నమోదయ్యాయి. కాగా, నిన్న మొత్తం 46,835 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య మొత్తం 36,24,096గా ఉంది. ఈ మేరకు ఈరోజు ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలను వెల్లడించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/