బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం

బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం ఆపరేషన్ థియేటర్ లో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. హాస్పటల్ లో ఒక్కసారిగా మంటలు వ్యాపించడం తో రోగులు భయాందోళనకు గురయ్యారు. ఆసుపత్రిలోని రోగులను పై అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ లోకి తరలించారు. అగ్నిప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.