పవన్ – చంద్రబాబు కలిసి పోటీ చేయాలంటూ వైస్సార్సీపీ నేత కీలక వ్యాఖ్యలు

రాబోయే ఎన్నికల్లో జనసేన – టీడిపి కలిసి పోటీ చేయాలనీ , ఈసారి వైస్సార్సీపీ కి సింగిల్ డిజిట్ వస్తే గొప్పేనని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు డీఎల్ రవీంద్రా రెడ్డి. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. రాబోయే ఎన్నికల్లో 175 కి 175 సీట్లు సాధిస్తామని వైస్సార్సీపీ నేతలు అంటుంటే..ప్రజలు మాత్రం సింగిల్ డిజిట్ వస్తే గొప్పే అని అంటున్నారు. ప్రజల నాడి తెలుసుకున్న వైస్సార్సీపీ నేతలు ముందుగానే పార్టీ నుండి బయటకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు టిడిపి , జనసేన పార్టీలలో చేరగా..ఎన్నికల సమయానికి నాటికీ వలసలు భారీగా ఉండబోతున్నాయని తెలుస్తుంది.

ఇదిలా ఉంటె వైస్సార్సీపీ నేత డీఎల్ రవీంద్రా రెడ్డి జగన్ ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు.రాజశేఖర్ రెడ్డి కుమారుడు ఇంత అవినీతిపరుడని అనుకోలేదని, పరిపాలన మొదటిరోజు నుంచే అవినీతి మొదలుపెట్టారని ఆరోపించారు. ఆ పార్టీలో తాను ఉన్నానంటే అసహ్యంగా ఉందన్నారు. ఈసారి వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే గొప్పేనని అన్నారు. గుర్తింపు పొందిన పార్టీ తరపున పోటీ చేద్దామనుకుంటున్నానని వ్యాఖ్యానించారు.

పవన్ కల్యాణ్ నిజాయతీని ప్రశ్నించలేమని , రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప మరో నేత కాపాడలేరని..రాష్ట్రం కోసం పవన్ – చంద్రబాబు కలిసి పోటీ చేస్తే బాగుంటుందని , పోటీ చేస్తారని అనుకుంటున్నాని తెలిపారు.