ర‌ద్దీగా ఉండే ప్ర‌దేశాల్లో ప్ర‌జ‌లు మాస్క్‌లు ధ‌రించండి: కేంద్ర ప్ర‌భుత్వం

wear-masks-in-crowded-places-government-advises-as-covid-cases-spike-in-china

న్యూఢిల్లీః చైనాలో కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈరోజు కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ ఉన్న‌త అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. మీటింగ్ అనంతరం మంత్రి ట్వీట్ చేశారు. కోవిడ్ ఇంకా ముగిసిపోలేద‌ని, అంద‌రూ అల‌ర్ట్‌గా ఉండాల‌ని, నిఘా పెంచాల‌ని ఆదేశించిన‌ట్లు మంత్రి తెలిపారు. ర‌ద్దీగా ఉండే ప్ర‌దేశాల్లో ప్ర‌జ‌లు మాస్క్‌లు ధ‌రించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం సూచ‌న చేసింది. చైనాలో మ‌ళ్లీ కోవిడ్ కేసులు తీవ్రంగా పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ ప్ర‌క‌ట‌న చేసింది. ఎటువంటి ప‌రిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పారు. మంత్రి మాండ‌వీయ మీటింగ్‌లో పాల్గొన్న అధికారులు అంద‌రూ మాస్క్‌లు ధ‌రించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/