పార్టీ మార్పుపై స్పందించిన డీకే అరుణ

తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న అరుణ

dk-aruna-response-on-party-change

హైదరాబాద్‌ః తెలంగాణలో బిజెపిలో మొన్నటి వరకు పెద్ద పెద్ద నేతలు చేరారు. ఇప్పుడు కీలక నేతలు కొందరు పార్టీని వీడారు. బిజెపిని చాలా మంది నేతలు వీడబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది. ఈ జాబితాలో మాజీ మంత్రి, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా ఉన్నారని అంటున్నారు. తాజాగా ఈ వార్తలపై డీకే అరుణ స్పందించారు. తాను బీజేపీని వీడే ప్రసక్తే లేదని… కాంగ్రెస్ లో చేరే అవకాశమే లేదని చెప్పారు. తనపై కొందరు పనికట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బిజెపి అధినాయకత్వం తనను గుర్తించి జాతీయ ఉపాధ్యక్ష పదవిని ఇచ్చిందని అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో పని చేయాలంటే అదృష్టం ఉండాలని చెప్పారు.