శాకుంతలం ఎన్ని కోట్లు నష్టం తెచ్చిందంటే..

How many crores of loss did Shakuntalam bring?

గుణశేఖర్ డైరెక్షన్లో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం మూవీ భారీ నష్టాలను మిగిల్చింది. ముందు నుండి కూడా చాలామంది ఈ సినిమా ఫై అనుమానాలే వ్యక్తం చేయగా..అదే నిజమైంది. విడుదలైన మొదటి రోజు మొదటి ఆట తోనే భారీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో మూడు రోజుల్లోనే చాల థియేటర్స్ నుండి సినిమాను లేపేశారు. ప్రస్తుతం అక్కడక్కడా పలు థియేటర్స్ లలో సినిమాను రన్ చేస్తున్న..మరో రెండు రోజుల్లో అక్కడ కూడా లేపేస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు దాదాపు 12 నుంచి 13 కోట్ల మేర నష్టాలు వచ్చినట్లు తెలుస్తుంది.

ఇక ఈ మూవీ వారం కలెక్షన్స్ చూస్తే.. ఏపీ నైజాంలో శాకుంతలం సినిమా 1.05 కోట్లు సాధించగా సీడెడ్ లో 25 లక్షల ఉత్తరాంధ్రలో 36 లక్షలు ఈస్ట్ గోదావరిలో 19 లక్షలు వెస్టులో 12 లక్షలు గుంటూరులో 17 లక్షలు కృష్ణలో 19 లక్షలు నెల్లూరులో 9 లక్షలు మొత్తం ఆరు రోజుల్లో శాకుంతలం 2.48 కోట్ల షేర్ రాబట్టుకొని 4.85 కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది.

ఏడు రోజుల్లో ఏపీ మొత్తం 2.48 కోట్ల షేర్ తమిళనాడులో 35 లక్షల షేర్ కర్ణాటక అలాగే రెస్టాఫ్ ఇండియా 38 లక్షల షేర్ ఇక ఓవర్సీస్ లో ఇప్పటి వరకు ఈ సినిమాకు ఒక కోటికి అటూ ఇటూగా షేర్ మాత్రమే దక్కించుకుంది. ప్రపంచ వ్యప్తంగా 4.28 కోట్ల రేంజ్ షేర్ కలెక్షన్లు 9 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం.