ఏపీలో ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు

Disqualification of two MLCs in AP

అమరావతిః ఏపీలో ఇద్దరు ఎమ్మెల్సీలపై శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు అనర్హత వేటు వేశారు. జనసేనలో చేరిన వంశీకృష్ణ, టిడిపిలో చేరిన సి.రామచంద్రయ్యలపై ఆయన చర్యలు తీసుకున్నారు. వీరిద్దరూ వైసీపీ తరపున ఎమ్మెల్సీలుగా గెలుపొందారు. అయితే ఇటీవల ఇద్దరూ వైఎస్‌ఆర్‌సిపికి గుడ్ బై చెప్పి పార్టీలు మారారు. దీంతో, వీరిపై చర్యలు తీసుకోవాలంటూ శాసనమండలి ఛైర్మన్ కు, మండలి కార్యదర్శికి మండలిలో చీఫ్ విప్ మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపులపై సమగ్ర విచారణ నిర్వహించిన అనంతరం ఇద్దరి సభ్యత్వాలపై మండలి ఛైర్మన్ అనర్హత వేటు వేశారు.