కర్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు పూర్తి
అశ్రునయనాలతో.. సైనిక అధికార లాంఛనాలతో ఘనంగా వీడ్కోలు



సూర్యాపేట: భారత్-చైనా ఘర్షణలో వీరమరణం పొందిన కర్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో ముగిశాయి. అంతిమయాత్రలో భారీగా ప్రజలు పాల్గొన్నారు. సూర్యాపేట సమీపంలోని స్వగ్రామం కేసారంలో సైనిక లాంఛనాలతో సంతోష్‌బాబు అంత్యక్రియలు నిర్వహించారు. సంతోష్ పార్థివదేహాన్ని ఆర్మీ అధికారులు చితివద్దకు తీసుకువచ్చారు. వీరజవాన్‌కు నివాళిగా జవాన్లు గాల్లోకి మూడుసార్లు తూటాలు పేల్చి.. గౌరవ వందనం సమర్పించారు. ఆపై సంతోష్‌బాబు సతీమణి, కుమారుడు, బంధువులు, ప్రజలు సెల్యూట్ చేశారు. కుమారుడు సంతోష్‌బాబు చితికి తండ్రి ఉపేందర్ నిప్పుపెట్టడంతో అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. కాగా పలువురు రాజకీయ ప్రముఖులు కల్నల్ భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంత్యక్రియలకు పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించారు. కుటుంబ సభ్యులు, ఆర్మీ అధికారులకు మాత్రమే అనుమతి ఇచ్చారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/