ప్రాజెక్ట్ కే నుండి దిశా పటానీ ప్రీ లుక్ రిలీజ్

ప్రభాస్ – నాగ్ అశ్విన్ కలయికలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే నుండి దిశా పటానీ ప్రీ లుక్ రిలీజ్ అయ్యింది. బాహుబలి మూవీ తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సాధించిన ప్రభాస్..ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్ వంటి వరుస పాన్ మూవీస్ చేసి మరింత ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఒకటి , రెండు కాదు ఏకంగా నాల్గు పాన్ మూవీస్ ను లైన్ లో పెట్టాడు. వాటిలో ఆదిపురుష్ మూవీ ఈ నెల 16 న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. ఇక కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్ట్ కె, మారుతీ డైరెక్షన్లో రాజా డీలక్స్ మూవీస్ చేస్తున్నాడు.

ఈ మూడు కూడా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్నాయి. వీటిలో నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేస్తున్న ప్రాజెక్ట్ కె చాల ప్రత్యేకం. ఈ మూవీ ఎవెంజర్స్ తరహాలో ఉండబోతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మూవీ లో ప్రభాస్ కనిపించబోతున్నాడు. అలాగే బాలీవుడ్ స్టార్ నటి నటులు ఈ మూవీ లో యాక్ట్ చేస్తున్నారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ ని నిర్మాత అశ్విని దత్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమా లో హీరోయిన్స్ గా బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకునే మరియు దిశా పటానీ నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ మధ్య దీపికా ప్రీ లుక్ రివీల్ చేశారు.. తాజాగా దిశా పటానీ యొక్క ప్రీ లుక్ ను విడుదల చేశారు. దిశా పటానీ యొక్క బర్త్ డే సందర్భంగా బ్లాక్ అండ్ వైట్ లో దిశా పటానీ యొక్క కళ్లు మాత్రమే చూపిస్తూ ప్రాజెక్ట్ కే లోని ఆమె లుక్ ను కాస్త రివీల్ చేశారు. ప్రభాస్.. దీపికా పదుకొణె మరియు అమితాబచ్చన్ ల మాదిరిగా పుట్టిన రోజు సందర్భంగా దిశా పటాని యొక్క ప్రీ లుక్ ను రివీల్ చేయడంతో సినిమా పై మరింతగా అంచనాలు పెంచారు. ఈ సినిమా లో దిశా పటాని పాత్ర ఏంటి అనేది అందరి లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.