కార్యకర్తలకు నేతలు అండగా ఉండాలి – జగన్

పులివెందుల పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, నేతలతో జరిగిన భేటీలో YS జగన్ కీలక సూచనలు చేశారు. ‘కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటాం. మళ్లీ మంచి రోజులు వస్తాయి. ఎవరూ అధైర్యపడొద్దు. రాబోయే కాలం మనదే. ప్రతి కుటుంబంలో మనం చేసిన మంచి ఉంది. మన పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది. భవిష్యత్ మనదే. కష్టకాలంలో కార్యకర్తలకు అండగా నిలబడాలని పార్టీ ప్రజాప్రతినిధులకు జగన్ సూచించారు’ అని వైసీపీ ట్వీట్ చేసింది.

ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ మొదటిసారి పులివెందుల నియోజకవర్గంలో మండలాల వారీగా వైసీపీ నాయకులు , కార్యకర్తలతో మూడు రోజుల పాటు నిర్వహించిన సమీక్షా సమావేశాలు సోమవారంతో ముగిసాయి. దీంతో జగన్ పులివెందుల నుంచి హెలికాప్టర్‌లో బెంగుళూరుకు బయలుదేరి వెళ్లారు.