తెలంగాణ లో భారీగా పెరిగిన లిక్కర్ సేల్స్

తెలంగాణ లో లిక్కర్ అమ్మకాలు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. పండగల సమయాల్లోనే కాదు మాములు రోజుల్లో కూడా భారీగా లిక్కర్ అమ్మకాలు జరుగుతుంటాయి. ఈ అమ్మకాల వల్లే రాష్ట్ర ఖజానా నిండుతుందని చెప్పాలి. ఇక గత ఏడాది జనవరి , ఫిబ్రవరి నెలలతో పోలిస్తే , ఈ ఏడాది జనవరి , ఫిబ్రవరి లిక్కర్ అమ్మకాలు భారీ ఎత్తున జరిగాయని అధికారులు చెపుతున్నారు.

గత ఏడాది జనవరి లో రూ.2,548 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగితే, ఈ జనవరిలో రూ.2,864 కోట్ల సేల్స్ జరిగాయి. అలాగే గత ఫిబ్రవరిలో రూ. 1,719 కోట్ల అమ్మకాలు జరిగితే, ఈసారి ఈ నెలలో ఇప్పటి దాకా రూ.1,600 కోట్ల సేల్స్ జరిగాయి. మిగిలిన 8 రోజుల్లో రూ.600 కోట్ల దాకా లిక్కర్​సేల్ అయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు. అధికారులు ఈ లెక్కన యావరేజ్ గా జనవరిలో రూ.300 కోట్ల సేల్స్ పెరగగా, ఫిబ్రవరిలో రూ.500 కోట్లు పెరిగే చాన్స్ ఉంది. సీజన్​ను బట్టి అమ్మకాలు పెరుగుతున్నాయని, రానున్న మూడు నెలల్లో మరింత పెరుగుతాయని ఎక్సైజ్ అధికారులు చెపుతున్నారు. ఇక 2022 జనవరి 1 నుంచి డిసెంబర్​30 వరకు ఏకంగా రూ.34,117 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. ఇది ఆల్ టైమ్ రికార్డు. ఈ అమ్మకాలతో ప్రభుత్వానికి రూ.29 వేల కోట్ల ఆదాయం వచ్చింది.