కోవిడ్ టీకా వేయించుకున్న ఢిల్లీ సీఎం

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ నేడు కోవిడ్ టీకా తీసుకున్నారు. ఎల్ఎన్‌జేపీ హాస్పిట‌ల్‌లో ఆయ‌న ఇవాళ ఉద‌యం టీకా తొలి డోసు వేయించుకున్నారు. సీఎం కేజ్రీవాల్ పేరెంట్స్ కూడా ఇవాళే టీకా తీసుకున్నారు. 60 ఏళ్లు దాటిన వారికి ప్ర‌భుత్వం ఉచితంగా కోవిడ్ టీకా ఇస్తున్న‌ది. దేశ‌వ్యాప్తంగా కోవిడ్ టీకా ప్ర‌క్రియ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/