కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం : ప్రభుత్వ ఉద్యోగులు యూట్యూబ్ చానెల్స్ నడపరాదు

కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు యూట్యూబ్ చానెల్స్ నడపరాదని జీవో జారీ చేసింది. ఈ జీవో ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ప్రస్తుతం యూట్యూబ్ వాడకం విపరీతంగా పెరిగింది. యూట్యూబ్ ద్వారా భారీగా ఆదాయం సంపాదించే అవకాశం ఉండడం తో ఇంట్లోనే ఉండి యూట్యూబ్ చానెల్స్ రన్ చేస్తూ సంపాదిస్తున్నారు. దీంతో మాములుగా నిరుద్యోగుల నుండి ప్రభుత్వ ఉద్యోగుల వరకు యూట్యూబ్ ద్వారా సంపాదిస్తున్నారు.

ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు వ్యక్తిగత యూట్యూబ్ ఛానెల్‌లను ప్రారంభించరాదని కేరళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్వీస్ రూల్స్ ఉల్లంఘించారనే కారణంతో ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. యూట్యూబ్ ఛానెల్‌ల ద్వారా ప్రభుత్వానికి అదనపు ఆదాయం రాకుండా చేసేందుకు ప్రభుత్వం ఈ నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు ఫిబ్రవరి 3న రాష్ట్ర హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వు ప్రకారం, యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించడం కేరళ ప్రభుత్వ సేవకుల ప్రవర్తనా నియమాలు, 1960ని ఉల్లంఘించడమే అని పేర్కొంది. యూట్యూబ్ ఛానెల్స్ ప్రారంభించడానికి ప్రస్తుత నిబంధనల ప్రకారం అనుమతి ఇవ్వలేమని ఉత్తర్వుల్లో పేర్కొంది.