పవన్ కోసం బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నాడా..?

ఒకప్పుడు మెగా , నందమూరి కుటుంబాల మధ్య కాస్త వార్ నడిచేది..అలాగే ఇరు ఫ్యాన్స్ కూడా నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆలా కాదు. ఇరు అభిమానులు ఒక్కటే అని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటించడం..ఆ తర్వాత బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెళ్లడం, ఇటు రాజకీయాల్లోనూ టీడీపీ కి పవన్ సపోర్ట్ గా ఉండడం తో మెగా , నందమూరి అభిమానుల మధ్య మరింత బలం పెరిగింది.

ఈ క్రమంలో తాజాగా పవన్ కోసం బాలయ్య ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడనే వార్త చక్కర్లు కొడుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమాకు బ్రో ఐ డోంట్ కేర్ అనే టైటిల్ పెట్టాలి అనుకున్నారు. బాలకృష్ణ ఆటిట్యూడ్ కు ఇది సరిగ్గా సరిపోతుందని అభిమానులు కూడా పండగ చేసుకున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈపాటికి సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేసి ఉండేవాళ్లు. కాకపోతే మధ్యలో పవన్ కళ్యాణ్ సినిమాకు బ్రో టైటిల్ కన్ఫర్మ్ చేశారు.

సముద్రఖని దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమా జులై 28న విడుదల కానుంది. ఆల్రెడీ పవన్ సినిమాకు బ్రో అనే టైటిల్ పెట్టడంతో.. తన సినిమాకు మళ్ళీ అదే పెడితే బాగోదు అని బాలకృష్ణ టైటిల్ విషయంలో వెనక్కి తగ్గాడు. అనిల్ రావిపూడి కూడా ఈ విషయంలో బాలయ్యకు తగ్గ టైటిల్ కోసం ట్రై చేస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతం మోనార్క్ టైటిల్ గట్టిగా వినిపిస్తుంది.