ప్రభాస్‌ ప్రాజెక్ట్‌ కెలో కమల్‌ హాసన్‌..?

ప్రస్తుతం సోషల్ మీడియా లో ఇదే హాట్ టాపిక్ గా నడుస్తుంది. మహానటి మూవీ తో దేశ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్ననాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ కె మూవీ తెరకెక్కుతుంది.వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వినీదత్‌ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్​లో ప్రభాస్​కు జోడీగా దీపికా పదుకొణె నటిస్తుండగా , బాలీవుడ్ లెజెండ్ యాక్టర్ బిగ్ బి అమితాబ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ తాలూకా ఓ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అవుతుంది.

ఇప్పటికే ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ వంటి స్టార్స్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో స్టార్‌ నటుడు ప్రాజెక్ట్‌ కె లో భాగం కానున్నట్లు తెలుస్తోంది. లోకనాయకుడు కమల్‌ హాసన్‌ ‘ప్రాజెక్ట్‌ కె’ లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రంలో కమల్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సినిమాలో ఆయన కనిపించేది కేవలం 30 నిమిషాలు మాత్రమే అని , ఇందుకు గాను రూ.150 కోట్ల వరకు రెమ్యూనరేషన్‌ తీసుకోనున్నట్లు కోలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాని.. 2024 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. అక్టోబర్‌ కల్లా ప్రొడక్షన్‌ పనులను పూర్తి చేసి అనుకున్న టైమ్‌ లైన్‌ ప్రకారం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారా..? అనేది చూడాలంటున్నారు.