త్రివిక్రమ్ కోసం పవన్ ఆ నిర్ణయం తీసుకున్నాడా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల మధ్య స్నేహం గురించి ఎంత చెప్పిన తక్కువే..జల్సా నుండి మొదలైన వీరిద్దరి ప్రయాణం సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. కేవలం సినిమాల పరంగానే కాదు రియల్ లైఫ్ కు సంబంధించి కూడా ఇద్దరు మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా త్రివిక్రమ్ కోసం పవన్ కళ్యాణ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఒకవైపు పవన్ సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు మహేశ్‌ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు త్రివిక్రమ్. దీనికి గుంటూరు కారం అనే టైటిల్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. సంక్రాంతి సందర్భంగా దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చాలా రోజుల ముందే దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా సంక్రాంతికి విడుదల చేస్తామని దర్శకుడు హరీశ్‌ శంకర్ చెప్పాడు. నవంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి.. జనవరిలో సినిమా విడుదల చేయాలి అని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

కానీ తన స్నేహితుడి సినిమా కూడా పండక్కి ఉండడంతో తన సినిమాను సమ్మర్ కు వాయిదా వేయాలని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తన నిర్మాతలను కూడా ఒప్పించే బాధ్యత పవన్ తీసుకున్నాడని అంటున్నారు. మరి నిజంగానే వాయిదా వేస్తారా..లేక సంక్రాంతికే రిలీజ్ చేస్తారా అనేది చూడాలి.