ధమాకా క్లోజింగ్ కలెక్షన్స్..

రవితేజ – నక్కిన త్రినాద్ కలయికలో వచ్చిన ధమాకా మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. క్రాక్ తర్వాత ఒక్క హిట్ కూడా లేక రవితేజ తో పాటు అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో ధమాకా వచ్చి బ్లాక్ బస్టర్ కావడం అందరిలో సంతోషం నింపింది. క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ..మొదటి ఆట తో హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా తొలిరోజున 10 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా..అంతే వేగంగా రూ.100 కోట్ల జాబితాలో చేరింది.

తాజాగా ఈ చిత్ర క్లోజింగ్ కలెక్షన్స్ బయటకు వచ్చాయి. నైజాంలో 18 కోట్లు, సీడెడ్ ప్రాంతంలో 7.25 కోట్లు, గుంటూరులో 2 కోట్లు, కృష్ణా 2 కోట్లు, నెల్లూరు జిల్లాలో 1 కోటి, పశ్చిమ గోదావరి జిల్లాలో 1 కోటి, తూర్పు గోదావరి జిల్లాలో 2 కోట్లు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో 4.5 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా రూ. 37 కోట్ల షేర్ 70 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 3.5 కోట్లకుపైగా, అమెరికా, ఇతర దేశాల్లో 2.75 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల షేర్, 85 కోట్ల రూపాయాల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ప్రస్తుతం రవితేజ రావణాసుర మూవీ చేస్తున్నాడు. సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లో రవితేజ సరసన ఏకంగా 5 గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అనూ ఇమ్మాన్యూయేల్, మేఘా ఆకాష్, ఫరీయా అబ్దుల్లా, దీక్షా నగార్కర్, పూజిత పొన్నాడ నటించారు. అలాగే ఈ చిత్రంలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించబోతుండగా.. హీరో సుశాంత్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అభిషేక్ పిక్చర్స్, ఆర్జి టీం వర్క్స్ బ్యానర్స్ పై సినిమా నిర్మితమవుతుంది. హర్షవర్ధన్ రామేశ్వర్, బీమ్స్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఏప్రిల్ 07 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.