వర్మకు దేవినేని ఉమా సవాల్

devineni uma maheswara rao
devineni uma maheswara rao

వివాదాలకు కేరాఫ్ గా నిలిచే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కు..టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమా సవాల్ విసిరారు. టీడీపీ హయాంలో చేసిన పనులపై , కట్టిన ప్రాజెక్ట్ లపై సినిమా తీయాలని అన్నారు. పట్టిసీమ దండగ అని వైసీపీ నేతలు ప్రచారం చేశారని… ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అక్కడ షూటింగ్ చేయడానికి ఆర్జీవీని పంపించారని ఆయన విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం పట్టిసీమను పట్టించుకోలేదని, కనీసం మెయింటెనెన్స్ కూడా చేయించడం లేదని దుయ్యబట్టారు. ప్రాజెక్టులపై తమ అధినేత చంద్రబాబు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను ప్రపంచం మొత్తం చూసిందని అన్నారు.

ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద రామ్ గోపాల్ వర్మ షూటింగ్ చేయడంపై ఉమా అభ్యంతరం తెలిపారు. విమర్శించడానికి ఇప్పుడు వైసీపీకి ఏమీ లేకపోవడంతో… పట్టిసీమను టార్గెట్ చేశారని మండిపడ్డారు. పవిత్ర సంగమం వద్ద ఉమా ప్రత్యేక పూజలు నిర్వహించి, జలహారతి ఇచ్చారు.