తిరుమల నడక మార్గంలో ఎలుగుబంటి హల్ చల్

తిరుమల నడక మార్గంలో చిరుతను అధికారులు పట్టుకున్నారని..ఇక భయం లేదని హక్తులు అనుకున్నారో లేదో..ఈరోజు నడకమార్గంలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. సోమవారం ఉదయం 2000వ మెట్టు దగ్గర భక్తులకు ఎలుగుబంటి కనిపించింది. దీంతో అది ఎక్కడ దాడి చేస్తుందో అని భక్తులు భయంతో పరుగులు తీశారు. దీంతో అలర్ట్‌ అయిన అధికారులు..ఎలుగు బంటి కోసం గాలిస్తున్నారు.

భక్తులు ఈ విషయంలో భయపడకూడదని..పిల్లలను జాగ్రత్తగా ఉంచుకోవాలని అధికారులు చెబుతున్నారు. కాగా, తిరుమల నడక మార్గంలో చిన్నారి లక్షితను చంపిన చిరుతను అధికారులు బందించగా… తిరుమల నడక మార్గంలో మరో మూడు చిరుతలు సంచరిస్తున్నట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అవి తిరుగుతున్న ప్రాంతాలను గుర్తించినట్లు వెల్లడించారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని వాటిని పట్టుకునేందుకు ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టు..ఎలాంటి భయం అవసరం లేదని ధైర్యం చెప్పారు.