భారీగా కరోనా పరీక్షలు చేయాలి
భాధితులను త్వరగా గుర్తించి చికిత్స అందించాలి: మన్మోహన్

న్యూఢిల్లీ: దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులపై మాజి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో తగినన్ని కరోనా పరీక్షలు చేయట్లేదు. పెద్ద ఎతున కరోనా పరీక్షలు చేయలన్నారు. అలా చేయలేక పోతే కరోనాపై విజయం సాధించడం సాధ్యం కాదని అన్నారు. కరోనా పై పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు చేసిన సూచనలను వీడియో రూపంలో తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దేశంలో భారీగా కరోనా పరీక్షలు చేసి భాధితులను త్వరగా గుర్తించి ఆసుపత్రుల్లో చికిత్స అందించడం చాలా ముఖ్యమని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/