అందితే జుట్టు.. అందకపోతే కాళ్ళు.. ఇదీ బాబు నైజం : అంబ‌టి

Ambati Rambabu

అమరావతిః ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ‌ బిజెపితో టిడిపి పొత్తు ఖరారైన విషయం తెలిసిందే. ఇలా బిజెపితో టిడిపి పొత్తు పెట్టుకోవడంపై వైఎస్‌ఆర్‌సిపినేత‌ అంబటి రాంబాబు ‘ఎక్స్’ ( గ‌తంలో ట్విట‌ర్‌) వేదికగా త‌న‌దైన శైలిలో స్పందించారు. గతంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేశారు.

“అప్ప‌ట్లో ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు బాబు. ఆ సమ‌యంలో ప్రధాని మోదీని టెర్రరిస్ట్ అని కూడా అన్నాడు. కానీ అప్పుడు ఎవరినైతే టెర్రరిస్ట్ అని అన్నాడో.. ఆ టెర్రరిస్ట్ కాళ్ళనే నేడు చంద్రబాబు పట్టుకుంటున్నాడు. అందితే జుట్టు.. అందకపోతే కాళ్ళు.. ఇదీ బాబు గారి నైజం అర్దమయ్యిందా..?” అంటూ అంబటి రాంబాబు త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.