నిబంధనలకు విరుద్ధంగా భూమి కేటాయింపులు

అమరావతి: టిడిపి నేత దేవినేని ఉమ ఏపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఉత్తరాంధ్రలో ఇటీవలి కాలంలో జగన్ ప్రభుత్వం ఫార్మా కంపెనీలకు కేటాయించిన భూములపై ఆయన మాట్లాడుతూ..నిబంధనలకు విరుద్ధంగా భూమి కేటాయింపులు జరిగాయని మండిపడ్డారు. ‘సబ్ లీజుకు ఇవ్వకూడదంటున్న పర్యాటకశాఖ నిబంధనలు, అయినా బేపార్కులో వాటా కొనుగోలు చేసిన ఫార్మా కంపెనీ, బోనస్ గా 16ఏళ్లుగా నిర్మాణం చేపట్టని వందలకోట్ల భూమి ఫార్మా కంపెనీకి, నామమాత్రపు ధరకు కేటాయింపుకు రంగంసిద్ధం. నిబంధనలకు విరుద్ధంగా చేతులుమారుతున్న డీల్స్ వెనక పెద్దలుఎవరు?’ అంటూ సిఎం జగన్ ను ఉద్దేశించి దేవినేని ట్వీట్ చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/